తుల ఉమకు తృటిలో తప్పిన ముప్పు

ykibps7jహైదారాబాద్: కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ తుల ఉమకు తృటిలో ప్రమాదం తప్పింది. ఇవాళ ఆమె ప్రయాణిస్తోన్న కారును మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్‌గేట్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఛైర్‌పర్సన్ కారు స్వల్పంగా ధ్వంసమైనట్టు సమాచారం.