తెదేపా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాజకీయపార్టీల్లో కదలిక: చంద్రబాబు
హైదరాబాద్: తెదేపా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో ఇతర రాజకీయపార్టీల్లో కదలిక వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. జూలై 9న తాము ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను నూటికి నూరుపాళ్లు అమలుచేసి తీరుతామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో అనంతపురం జిల్లాకు చెందిన వడ్డెరసంఘం నేతలు చంద్రాబాబును కలిసి బీసీ డిక్లరేషన్ చేసినందుకు ఆయనను సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు.