తెరాస ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేయడం సరి కాదు: శంకరరావు

హైదకాబాద్‌: డీజీపీ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మాజీ మంత్రి శంకరరావు మరోసారి తప్పుపట్టారు. ట్రిబ్యునల్‌ తీర్పుపై హైకోర్టు, సుప్రీకోర్టుకు వెళ్లవద్దని చెప్పినప్పటికి పట్టించుకోలేదని ఆయన అన్నారు. విద్యుత్‌ సమస్యపై ఆందోళనకు దిగిన ఎమ్యెల్యేలపై కేసులు నమోదు చేయడం సరి కాదని అభిప్రాయపడ్డారు.