తెలంగాణకు అడ్డుపడితే సహించం: హరీశ్‌

హైదరాబాద్‌: పరకాల ఉప ఎన్నికలో సమైక్యవాదానికి ప్రజలు పట్టంకట్టారన్న కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను తెరాస నేత హరీశ్‌రావు ఖండించారు. ఈ అంశంపై తాము చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. రాయలసీమ రాష్ట్ర డిమాండ్‌ పేరుతో బైరెడ్డి లాంటి వ్యక్తులు తెలంగాణకు అడ్డుపడితే సహించమన్నారు. ఈ ఉప ఎన్నికలో తెలంగాణవాదమే గెలిచిందని, సమైక్యవాదమే ఓడిపోయిందని ఆయన అన్నారు.