తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌
ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు వెళ్లిన రాష్ట్ర గవర్నర్‌ ఢిల్లీలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు. ఢిల్లీలో గవర్నర్‌ సోనియాగాంధీతో పాటు కీలక నేతలతో భేటీ అయ్యారు. గవర్నర్‌ స్పందిస్తూ ఢిల్లీ పెద్దలను కలవడంలోఒ ప్రత్యేక లేదన్నారు. తనపై వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని చెబుతున్న గవర్నర్‌ అఖిలపక్షం తర్వాత తెలంగాణ అంశం కొలిక్కి వస్తుందో లేదో కేంద్రమే తేల్చాలన్నారు. కాగా మూడు రోజుల పర్యటనను ముగించుకుని గవర్నర్‌ నరసింహన్‌ శనివారం హైదరాబాద్‌ చేరుకుంటారు.