తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి : విజయశాంతి

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని మెదక్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ విజయశాంతి డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రజల మనోభావాలు గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అక్బరుద్దీన్‌ ఓవైసీకి సరికాదని విజయశాంతి పేర్కొన్నారు.