తెలంగాణపై సానుకూల నిర్ణయం ప్రకటించండి
ఆజాద్, బొత్సలకు తెలంగాణ డీసీసీ అధ్యక్షుల విజ్ఞప్తి
హైదరాబాద్: తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి ముందే రాష్ట్ర ఏర్పాటుపై సానుకూల నిర్ణయం ప్రకటించాలని తెలంగాణ ప్రాంత డీసీసీ అధ్యక్షులు ఆజాద్, బొత్సలకు లేఖ ద్వారా విజ్ఞప్తిచేశారు. రేపు జరిగే పీసీసీ సమావేశంలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తాలని వారు నిర్ణయించారు. త్వరలో పార్టీయువనేత రాహుల్‌గాంధీని కలిసి తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరనున్నట్టు వారు తెలియజేశారు.