తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ముస్లింల రిజర్వేషన్‌ సమస్యకు సంబందించి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో వ్యక్తమవు తున్న వివిధ వాదాలు ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలను సంకట స్థితిలోకి తోసేవిగా ఉన్నాయి. ముస్లింల నందర్ని మతం ప్రాతిపదికగా వెనుకబడిన తరగ తిగా ప్రకటించి రిజర్వేషను కల్పించాలనీ, ముస్లిం లకు ప్రత్యేక కోటా ద్వారా అధిక ప్రాధాన్యత ఇ వ్వాలనీ, ఒకవేళ ఓబీసీ ముస్లింలలో కనీసార్హతలు కూడా లేనివారు ఉండి కోటా పూర్తి కానప్పుడు దానిని మిగిలిన ముస్లింలకు ఉత్తర భారత దేశంలోని అష్రాఫ్‌ లకు ఇవ్వాలని సయ్యద్‌ షహ బుద్దీన్‌ లాంటివారు వాదిస్తున్నారు. ఓబీసీ లుగా గుర్తింపు పొందిన ముస్లింలలో అనేకమంది ఈ వాదాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలనందరినీ, ఒకవేళ ఓబీసీ ముస్లింలకు ప్రత్యేక కోటా ఉన్నా అష్రాఫ్‌లు దోంగ కులధృవీకరణ పత్రాలను పోందు పర చడం ద్వారా ఓబీసీ ముస్లింలకు అన్యాయం చేస్తా రనీ భయపడుతున్నారు. ఉత్తర భారతదేశ ముస్లిం సమాజ నేపథ్యంలో వారి వారి దృక్పథాల ఆధా రంగా ఈ రెండు వాదనాలూ, కొన్ని పరిమితు లతో సరియైనవిగానే కన్పిస్తున్నాయి. రిజర్వేషన్‌ వాదాలను విన్పించడంలో ఉత్తర భారతదేశ ముస్లిం సమాజాన్ని తీసుకొని, మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింల తరపున వీరు వెలిబు చ్చుతున్న అభిప్రాయాలు దక్షిణ భారతదేశ ముస్లిం లకు, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలకు తీవ్ర అన్యాయం కలగజేస్తాయనేది ఇక్కడి ముస్లిం సమాజంతో పరిచయం ఉన్నవారికెవరికైనా వెంటనే స్పూరిస్తుంది.

ఉత్తర భారతదేశంలోని ముస్లింల సామాజిక దృశ్యంతో పోలిస్తే అంధ్రప్రదేశ్‌ ముస్లిం సమాజం భిన్నమైనది. అక్కడి ముస్లిం సమాజంలో అష్రాఫ్‌, అజ్లాఫ్‌, అర్జాల్‌ విభజన చాలా సృష్టంగా, లోతు గా, తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ముస్లిం సమా జంలో షేక్‌, సయ్యద్‌ లాంటి విభజనలున్నా నూర్‌ బాష్‌ ముస్లింలను తక్కువచూపుతో చూస్తోన్నా, ఇక్కడి వ్యత్యాసాలు అక్కడి ముస్లిం సమాజమంత లోతుగా, తీవ్రంగా లేవు. అక్కడ ఇస్లాం పుచ్చు కున్న తర్వాత కూడా ఎక్కువ శాతం మంది తమ పూర్వ కులవృత్తులలోనే కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొందరు మాత్రమే తమ పూర్వ కులవృత్తుల్లో కొనసాగుతుండగా ఎక్కువ శాతం మంది తమ పూర్వ కులవృత్తుల నుండి దూరమై వివిధ చిన్న చిన్న ఆర్థిక కార్యకలాపాలలో కొనసా గుతున్నారు. అంటే ఉత్తర భారత ముస్లింలకన్నా ఎక్కువగా తమ పూర్వ కులవృత్తులనుండి బయట పడ్డారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలలో కూడా 85 శాతం నుండి 90 శాతం మంది మ తాంతీకరణ పొందినవారే అయినా, తమ పూర్వ వృత్తుల నుండి బయటపడ్డం చేత కేవలం 30 శాతం మంది మాత్రమే నూర్‌బాసీయలుగా పరిగ ణించబడుతున్నారు. దీనిని బట్టి వెళితే మిగిలిన ముస్లింలంతా అగ్రవర్ణ ముస్లింలా అన్న సందేహం ప్రశ్నా రాకమానదు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక మంది నిమ్నకులాలకు చెందిన ముస్లింలు సామా జిక హోద కోసం తమ పేర్లకు ముందు షేక్‌ లాంటి అగ్రవర్ణ సూచకమైన ప్రెఫిక్స్‌లను పెట్టు కున్నారు. షేక్‌ దస్తగిరి, షేక్‌ జమాల్‌ సాహెబ్‌, షేక్‌ కమాల్‌ సాహెబ్‌, షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌ లాంటి షేక్‌ సాబ్‌లంతా నిజానికి ఇలాంటివారే!  అంతేకాక ఈ షేక్‌ సాబ్‌లేవరూ కూడా ఉత్తర భారతదేశంలోని షేక్‌ సాహెబ్‌లలాగా సామాజిక ఆర్థిక హోద సౌకర్యాలను అనుభవించలేదు. నూర్‌బాషీయులలో కూడా ఎంతోమంది పేరుకు ముందు షేక్‌ అనే పదముండడం మనం సాధార ణంగా గమనిస్తోన్నదే!

ఆంధ్రప్రదేశ్‌లోని నూర్‌బాషా ముస్లింలే కా కుండా షేక్‌, సయ్యద్‌ లాంటివారు కూడా అన్ని రంగాల్లోనూ దారుణంగా వెనుకబడి ఉన్నారన్నది సుసృష్టం. వెనుకబడిన తరగతులకు చెందిన పౌరులకు ప్రత్యేక సౌకర్యాలను కలుగజేసే అది óకారం రాజ్యాంగం రాజ్యానికి కల్పించింది కాబట్టీ, ఆంధ్రప్రదేశ్‌ ముస్లింలు తప్పకుండా ఈ కోవలోకి వస్తారు కాబట్టీ ప్రభుత్వం ముస్లింలను వెనుక బడిన తరగతులకు చెందినవారుగా ప్రకటించి జ నాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పిం చాలి. ముస్లింలకు ప్రత్యేకంగా ఏర్పాటు  చేయ బడే ఈ కోటాలో ఇప్పటికే ఓబీసీలుగా గుర్తింపు పోంది రిజర్వేషన్లననుభవిస్తున్న ముస్లింలకు ప్రత్యేక కోటా ఉండాలి

ముస్లింలందరికీ వెనుకబడిన తరగతుల కింద రిజర్వేషన్‌ కల్పిస్తే నూర్‌ బాషీయులకు లభించే ఆ అత్యల్ప సదుపాయాలు కూడా అంత రించే పరిస్థితులేర్పడతాయి అని నూర్‌బాషీయులు భావించడం సమంజసమైనది కాదు. ప్రస్తుతం వా రు వెనుకబడిన తరగతుల కేటగిరి బి లో ఉన్నా రు. ఈ కేటగిరిలోని మిగిలిన హిందూ ఓబీసీలతో వివిధ విషయాలలో నూర్‌బాషీయులు పోటీ పడలే కున్నారని కూడా వారు వాపోతున్నారు. అందుకే తమను కేటగిరి ఎ లోకి మార్చమని కూడా ప్రభు త్వానికి అప్పీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలనందర్నీ వెనుకబడిన తరగతిగా పరిగ ణించి కల్పించే రిజర్వేన్లలో నూర్‌ బాషీయులకు జనాభా ప్రాతిపరికన ప్రత్యేక కోటా కల్పిస్తే వారికి జరగాల్సినంత న్యాయం జరుగుతుంది. అంతేకా కుండా వారు ఎ గ్రూపులో చేరడం వలన ఎంత ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారో ఆయా ప్రయోజనాల కనుగుణంగానే ముస్లిం కోటాలో ప్రత్యేకంగా కోరవచ్చు. ఈ విషయమై వారినెవరూ అడ్డుకోరు, అడ్డుకోకూడదు కూడా. నూర్‌ బాషీ యులున్న కేటగిరి బి లో మరిన్ని కూలాలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వారు ముస్లింలందరికీ రిజర్వేషన్‌ కల్పిస్తే తమకు అన్యా యం చేకూరుతుందని భయపడడం కన్నా, ప్రత్యే క ముస్లిం కోటాకై మిగిలిన ముస్లింలందరితో కలి సి పోరాడుతారు.

-వేముల ఎల్లయ్య, స్కైబాబ

ఇంకావుంది..