తెలంగాణ ఆడపడుచులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండ
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 26
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆడపడుచులకు అండగా ఉన్నారని శంకరపట్నం జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం శంకరపట్నం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జడ్పిటిసి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ఆడపడుచులకు అండగా ఉండేందుకు దసరా పండుగను పురస్కరించుకొని, ప్రతి పేద కుటుంబం కు చెందిన మహిళ నూతన వస్త్రాలను అలంకరించి, బతుకమ్మ దసరా పండుగలను నిర్వహించుకునేందుకు ప్రభుత్వమే సొంత ఖర్చులతో బతుకమ్మ చీరలను అందజేస్తుందని వెల్లడించారు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పులికోట రమేష్, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పాలకొరక సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహిపాల్, క్యా దాసి భాస్కర్, బొజ్జ రవి, శంకర్, ఆయా గ్రామాల అంగన్వాడీ టీచర్లు, డీలర్లు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.