తెలంగాణ ప్రజలగొంతేండుతుంటే ఆంధ్రప్రాంతానికి సాగు నీరా..?

నల్గొండ: తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తుంటే ఆంధ్రాప్రాంతానికి మాత్రం సాగునీరు అందించటం వివక్ష కాదా అని టీఆర్‌ఎస్‌ ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. కృష్ణ నది ప్రవహించేది తెలంగాణలో కాని నీరు మాత్రం ఆంధ్రాప్రాంతానికి వెళ్తున్నాయని, డెల్టా ప్రాంతానికి నీరు ఆపాకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రతి రంగంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఒక్క పంటకు నీరివ్వని ప్రభుత్వం ఆంధ్రా ప్రాంతానికి మాత్రం మూడు పంటలకు నీరందిస్తుందని, మంత్రులను అడిగితో ఏవో జావోల పేర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు.