సింగరేణిపై విచారణ జరిపించమంటారా?

` బీఆరఎస్‌కు మంత్రి పొన్నం సవాల్
` కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న
హైదరాబాద్(జనంసాక్షి):సింగరేణిపై బీఆరఎస్ నేతలు దుష్పచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు. బీఆరఎస్ హయాంలో కాంట్రాక్టులు పొందిన వాళ్లు.. ఇప్పుడు చెడ్డవాళ్లయ్యారా అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన విÖడియా సమావేశంలో పొన్నం మాట్లాడారు. బీఆరఎస్ అధికారంలో ఉండగా ఎంతో అవినీతి జరిగినట్లు కవిత చెప్పారని.. ఆమె ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానం ఇవ్వలేదన్నారు. హిల్ట్ పాలసీలపైనా ఇలాగే ఆరోపణలు చేశారని.. అసెంబ్లీలో చర్చ పెడితే బహిష్కరించి వెళ్లిపోయారని చెప్పారు.