తెలంగాణ విశ్వ విద్యాలయంలో విద్యార్థి ఆత్మహాత్యాయత్నం

నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి మహేశ్‌ ఆత్మహత్యాయత్నం చేయడం విశ్వవిద్యాలయంలో కలకలం సృష్టించింది. విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడంతో అతను విషం తాగినట్టు తెలుస్తోంది. విశ్వవిద్యాలయ సిబ్బంది సహచరవిద్యార్థులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.