తెలుగుభాష పరిరక్షణకు కృషి చేసిన పీవీ రావు కన్నుమూత

అట్లాంటా : అమెరికాలో తెలుగు బోధనకు విశేషకృషి చేసిన డా, పెమ్మరాజు వేణుగోపాలరావు కన్నుమూశారు. అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా బోథనతో పాటు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన ఎంతో  సేవ చేశారని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. ఎమరీ విశ్వవిద్యాలయంలో ఆయన  భౌతికశాస్త్ర ఆచార్యులుగా బాధ్యతలు  నిర్వహించారు.