తొలివిడత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

` ఎప్రిల్‌ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ
` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు
` మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌ జారీతో బుధవారం నుంచే నామినేషన్‌ల పక్రియ ప్రారంభం అయ్యింది. బీహార్‌ మినహా తొలి విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే మిగితా 20 రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం ఇచ్చారు. బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్‌ల దాఖలుకు అవకాశం కల్పించారు. బీహార్‌ మినహా మిగితా 20 రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 28న నామినేషన్‌ల స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్కూట్రినీ జరగనుంది. బీహార్‌ మినహా మిగితా 20 రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్‌ల ఉపసంహరణకు తుదిగడువు. బీహార్‌లో నామినేషన్‌ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 2 వరకు అవకాశం ఇచ్చారు. జూన్‌ 6తో సాధారణ ఎన్నికల పక్రియ సంపూర్ణంగా ముగియనుంది. తొలి విడతలో 17 రాష్టాల్రు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్‌లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 8 స్థానాలు, మధ్యప్రదేశ్‌లోని 6 స్థానాలు, ఉత్తరాఖండ్‌, అసోం, మహారాష్ట్ర ల్లోని ఐదేసి స్థానాలు, బీహార్‌లోని నాలుగు స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని మూడు స్థానాలు, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయల్లోని రెండేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్ముకశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లోని ఒక్కో స్థానం ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌, జూన్‌ 1న తుది విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోపాటు నాలుగు రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.