దయానిధి కార్యాలయంలో పోలీసుల సోదాలు

చెన్నై: కేంద్రమంత్రి ఆళగిరి కుమారుడు దురై దయానిధి కార్యాలయంలో చెన్నై పోలీసులు సోదాలు నిర్వహించారు. గ్రానైట్‌ కుంభకోణంలో నిందితుడైన దురై దయానిధి నెల రోజులుగా పోలీసులకు చ్కికుండా అజ్ఞాతంగా ఉంటున్నారు.  సోదాల సందర్భంగా పోలీసులు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.