దస్తగిరిసహెబ్‌ దర్గాలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌:ప్రముఖ సూఫీ క్షేత్రం కన్యార్‌లోని దస్తగిరిసాహెబ్‌ దర్గాలో సోమవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.మంటలు భారీగా ఎగసిపడి దర్గాలోని ఇతరప్రాంతాలకు వ్యాపించాయి.ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమానక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.స్థానికులు కూడా సహయక చర్యల్లో పాల్గోంటున్నారు.ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు.