దహన సంస్కారాలకుచేయూత

అభినందనలు తెలిపిన పుర జనులు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆర్.కే.4 గడ్డ శాంతి నగర్ నివాసి కోట పార్వతి గత కొంత కాలంగా డెంగ్యూ వల్ల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఆమెకు ఒక కుమారుడు. ఆయన ఓ ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇళ్లు గడవడమే కష్టంగా ఉన్న కాలంలో ఇలాంటి సంఘటన జరగడం తో, దహన సంస్కారానికి ఆర్థిక ఇబ్బందులతో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉందని, స్థానిక ప్రజలు తోచిన సహాయం చేయాలనీ రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ కి సమాచారం ఇవ్వడంతో వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాతలు మానవత్వం తో స్పందించి
యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ కి 21,000రూపాయలు అందించారు. ఈ సహాయాన్ని యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు ఎర్రబెల్లి రాజేష్ , వెరైటీ తిరుపతి, చరణ్, రమేష్ కన్నా, రాకేష్, అరెళ్లి గోపి కృష్ణ , మృతురాలు కుమారుడు కోట కిషోర్ కు అందజేశారు.