దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
రజక సంఘం మండల అధ్యక్షుడు శివగారి అంజయ్య
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 30 : రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘం చేర్యాల మండల అధ్యక్షుడు శివగారి అంజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అమనగల్లు పట్టణ కేంద్రంలో సొంత పట్టా భూమిలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించడం కొంత మంది పెత్తందారులు సహించక ఐలమ్మ విగ్రహం వద్ద కాపలా కాస్తున్న వారిపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమానుషంగా దాడికి పాల్పడిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రజక సంఘం తరుపుర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ దాడి బిజేపి ఓబీసీ జాతీయ కమిషన్ సభ్యులు ఆధ్వర్యంలో జరగడం అత్యంత సిగ్గుచేటన్నారు. బడుగు బలహీనవర్గాల జాతుల వారిపై ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు.