దీదీకి దాదా లేఖ!

కోల్‌కతా, జూలై  ): యూపీఏ తరుఫున రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ టీఎంసీ పార్టీ మద్దతు కోరుతూ లేఖ రాశారు. తన మూలాలు బెంగాల్‌లో ఉన్నాయని, రాష్ట్రపతి పదవి రాజకీయాలకు ఆవల ఉంటుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించటం ఆయన బాధ్యత అని తెలిపారు. ఈ స్ఫూర్తితో టీఎంసీ తన విలువైన ఓటును తనకే వేయాలని కోరారు. మాజీ రాష్ట్ర పతులు బాబూ రాజేంద్రప్రసాద్‌, జాకిర్‌ హుస్సేన్‌ సంపన్న వారసత్వాన్ని వదిలివెళ్లారన్నారు. భారత్‌ రాజ్యాంగం పేదల పక్షాన ఉందన్నారు. అయితే ఈ లేఖపై వాస్తవ సంతకం లేదని ముద్రించిన సంతకం ఉందని, రూ. స్టాంప్‌ అతికించారని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఓబ్రయాస్‌ చెప్పారు. పార్టీ చీఫ్‌ మమతకు పంపిస్తే బాగుండేదని, చివరి ఆమె నిర్ణయం తీసుకోవాలని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 16న తన నిర్ణయం వెలువరిస్తానని మమత అంతకు ముందు చెప్పారు.