దుష్ప్రచారాలను నమ్మవద్దు

– జవహర్‌ నవోదయ విద్యాలయ విద్యార్ధులు అంతా క్షేమం

ఖమ్మం .(జనం సాక్షి) : ఖమ్మం జిల్లా పాలేరు జవహర్‌ నవోదయ విద్యాలయ  విద్యార్ధులకు వాంతులు, విరోచనాలు అయి అస్వస్థతకు గురి అయినారు. అయితే ఈ సంఘటనపై ఈరోజు సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియాలో)  దుష్ప్రచారం జరిగింది.  విద్యార్థుల ఆరోగ్యం విషయంలో మా విద్యాలయ తరుపున చింతిస్తున్నాము అని జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ చంద్రబాబు తెలిపారు. మొత్తం 26 మంది విద్యార్థులు  అస్వస్థకు గురయ్యారని తెలియజేసినారు. ఈ అస్వస్థకు కారణం సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్ళిన విద్యార్థులు సెలవుల అనంతరం ఇంటి నుండి తెచ్చుకున్న తినుబండారాలు ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోని తినడం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. కానీ అస్వస్థకు గురైన  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారణ చేసినారు…కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంపై ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని ప్రిన్సిపల్‌ తెలిపారు.