ధాన్యం కొంటారా..కొనరా?
` 18న మహాధర్నా
` ఇక బిజెపితో అవిూతువిూకి సిద్ధం
` వెంటాడుతాం..వేటాడుతాం
` కేంద్రం తీరుపై మండిపడ్డ సీఎం కేసీఆర్
హైదరాబాద్,నవంబరు 16(జనంసాక్షి):బిజెపితో ఇక ప్రత్యక్ష యుద్దానికి టిఆర్‌ఎస్ సన్నద్దం అవుతోంది. తాడోపేడో తేల్చుకోవాలని నిర్నయించింది. ధాన్యం కొనుగోళ్లపై రైతుల పక్షాన నిలదీయడం ద్వారా బిజెపిని ప్రజల్లో దోషిగా నిలబెట్టాలని నిర్ణయించింది. ఇక ప్రజాక్షేత్రంలో బిజెపితో ప్రతక్ష పోరాటానికి దిగాలని నిర్ణయించది. బిజెపిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని సిఎం కెసిఆర్ ఘాటుగానే హెచ్చరించారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న ఇందిరా పార్క్ వద్ద టీఆర్‌ఎస్ మహాధర్నా చేపడుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగుతుందన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ విూడియాతో మాట్లాడారు. సంవత్సరానికి ఎఫ్‌సీఐ తీసుకునే ధాన్యం టార్గెట్ వివరాలును రెండు, మూడు రోజుల్లో ఇవ్వాలని కేంద్రానికి రేపు లేఖ రాస్తాను. తమకు సమాధానం కావాలి. పెండిరగ్ పెడుతామంటే కుదరదు. తెలంగాణ రైతాంగం తరపున డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్ మహాధర్నా చేపడుతున్నాం. రాష్ట్ర కేబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, రైతుబంధు సమితిల జిల్లా అధ్యక్షులతో కలిసి మహాధర్నా చేస్తాం. మిమ్మల్ని వదిలిపెట్టం. రైతులను కాపాడుకునేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులందరూ ప్రజల గొంతుకగా మిమ్మల్ని ప్రశ్నించ బోతున్నాం. రేపు మధ్యాహ్నం లోపు మోదీకి, ఆహార శాఖ మంత్రికి లేఖ పంపిస్తాం. కేంద్రం విధానాలను స్పష్టం చేయాలి. బీజేపీ నేతలు రైతులను కన్ఫ్యూజన్ చేయొద్దు.. రైతులను ఆగం చేయొద్దని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆగమైన రైతులను అద్భుతంగా కాపాడుకుంటున్నాం. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. కరోనా టైంలో కూడా ధాన్యం కొనుగోలు చేశాం. తక్షణమే డబ్బులు కూడా పంపిణీ చేశాం. యాసంగి పంటలకు రైతు బంధు డబ్బులు త్వరలోనే ఇస్తాం. యాసంగిలో వరి పంటను వేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ముక్తకంఠంతో ధర్నాలో నిరసన వ్యక్తం చేస్తాం. అప్పటికీ స్పందన లేకపోతే ప్రజలే తేల్చుతారు. ఈ నెల18 తర్వాత కూడా మా పోరాటం కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం, బిజెపిల తీరుకు వ్యతిరేకంగా గురువారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రకటించారు. ఆ తరవాత గవర్నర్‌కు మెమోరాండం సమర్పిస్తామని అన్నారు. బిజెపి చేస్తున్న యాగీని వదిలేది లేదన్నారు. ఇక ఆపార్టీని వదిలిపెట్టబోమని అన్నారు. తొలిదశలో ఆందోళనకు శ్రీకారం చుడుతున్నామని అన్నారు. బిజెపిని వెంటాడుతామని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం పరిధిలోనే ఉందని ఆయన తెలిపారు. పంజాబ్‌లో మొత్తం కొనుగోలు చేస్తున్నారని, తెలంగాణలో చేయడం లేదని చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. యాసంగిలో ధాన్యం కొంటామని ఎఫ్‌సీఐ రాతపూర్వకంగా తెలిపితే దానిని కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంద ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వరి ధాన్యంపై కేంద్రం ద్వంద్వ ధోరణిని అవలంభిస్తోందన్నారు. అందుకే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచించామని కేసీఆర్ చెప్పారు. వరి ధాన్యం కొంటారా లేదా అని బండి సంజయ్‌ని అడిగాం. కొనుగోలు కేంద్రాల దగ్గర బండి సంజయ్ డ్రామాలాడు తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు అటుఇటుగా సాగుతున్న వేళ అక్కడికి వెళ్లాల్సిన అసవరం బండి సంజయ్‌కు ఎందుకని అన్నారు. గత యాసంగి నిల్వలపై, వచ్చే యాసంగి కొనుగోళ్లపై స్పష్టత లేదు. వరి కొనుగోళ్లపై ప్రధానికి, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖరాస్తాం. వరి ధాన్యం కొనుగోళ్లపై సరైన స్పష్టత ఇవ్వాలని కోరుతాం. పంజాబ్‌లో ధాన్యం కొన్నట్టుగా.. తెలంగాణలో కొంటారా లేదా? చెప్పాలి. కేంద్రం వైఖరిపై ఈ నెల 18న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఇందులో పార్టీ నేతలంతా పాల్గొంటారని అన్నారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అంతా పాల్గొంటారని అన్నారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. సుమారు మూడు గంటలపాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ నెలాఖరున టీఆర్‌ఎస్ ఛలో ఢల్లీి కార్యక్రమం నిర్వహించనుంది. ఈ ధర్నా కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి ఎమ్మెల్సీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆమోదం తెలపనున్నారు. సమావేశం అనంతరం కేసీఆర్ విూడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోంది. బఫర్ స్టాక్ చేయాల్సిన భాధ్యత కేంద్ర ప్రభుత్వం విూద ఉంది. ఒక్కో రాష్టాన్రికి ఒక నీతి అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోంది. పంజాబ్‌లో కొనుగోలు చేస్తూ మన దగ్గర కొనుగోలు చేయడం లేదు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నుంచి స్పందన లేదు. ఎఫ్‌సీఐ ధాన్యం కొంటామంటుంది. కేంద్రం కొనమంటుంది. గత యాసంగి ధాన్యం ఇంకా మన గోదాములలో ఉంది. వానాకాలం పంట కొంటారో కొనరో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో యాసంగి లో వరి వేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎలా చెపుతాడు. కొనుగోలు కేంద్రాలలో డ్రామాలు చేసేందుకు బీజేపీ నేతలు వెళ్లారు. రైతు నిరసన చేస్తే బీజేపీ నేతలు రాళ్లతో దాడి చేస్తున్నారు. రైతులను తప్పుదోవ పట్టించానని బండి సంజయ్ చెంపలు వేసుకోవాలి. వరి ధాన్యం కొంటారో కొనరో సమాధానం చెప్పాలి. బీజేపీ వ్యవహారాన్ని క్షమించేది లేదు. కొనుగోలు కేంద్రాల దగ్గర ధర్నా ఎందుకు?. టీఆర్‌ఎస్ కార్యకర్తలు రైతులు కాదా.. వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గరకు ఎందుకు రాకూడదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లను కొనుగోలు చేయబోమని తెగేసి చెప్పడం, మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు యాసంగిలో వరిపంటే వేయాలని రైతులను రెచ్చగొడుతుండటంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. యాసంగి వరిధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల కుట్రలను ఎండగట్టేందుకు ఎలాంటి రాజకీయ కార్యాచరణ రూపొందించాలన్నదానిపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.