నర్సాపురంలో తెలుగు సాంస్కృతిక నడక

నర్సాపురం : ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సాపురం నుంచి పాలకొల్లు వరకు 10 కిలోమీటర్ల మేర తెలుగు సాంస్కృతిక నడక సాగించారు. కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీవో జె.వసంతరావు, మున్సిపల్‌ కమిషనర్‌, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.