నవ్విపోదురు గాక నాకేమిటి సిగ్గు -కోర్టు బట్టలిప్పినా,

నలుగురిలో నగ్నంగా నిలబెట్టినా మన మాన్య మంత్రి వర్యులు పార్థసారథి హిహి..అంటూ నవ్వుతూ నిలబడడం చూసి జనమంతా ముక్కున వేలేసుకుంటున్నారు. తప్పు చేసిన వాడు తలదించుకోవాల్సింది పోయి ఈ నేరాలు ఇప్పటివి కావు నేను గతంలో చేసినవి అంటే అందరూ ఆశ్చర్య పడుతున్నారు. గతంలో చేసిన నేరాలకు గానూ కోర్టు తనను ఇపుడు దోషిగా తేల్చిందని ఈ పాత నేరస్థుడు చాలా ఈజీగా చెప్తుంటే జనం అవాక్కవుతున్నారు. నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందగా ఉంది ఈ మంత్రివర్యుని వైఖరి. అపలు ఆరోపణులుంటేనే మంత్రిగా కొనసాగవద్దు..అలాంటిది దోషిగా తేలాక కూడా కుర్చీకి జిడ్డులా పట్టుకోవడం వీరికే చెల్లింది..గతంలో రైలు పడ్డందుకే రైల్వే మంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి తన పదవికి రాజీనామా చేశాడు.ఎవరో టెలిఫోన్‌ ట్యాప్‌ చేసినందుకు ఏకంగా ముఖ్యమంత్రి పదవికే రాజీనామా చేశాడు అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే..85-86లో ప్రశ్నపతం లీకైనందుకు రాష్ట్ర విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బడ్జెట్‌ పద్దులు లీకైనందుకు ఏకంగా తన మంత్రి వర్గంలోని మంత్రుల చేత రాజీనామా చేయించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్‌ది. ఇలా ఎన్నో ఘటనలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధమున్నా..కనీసం ఆరోపణలున్నా రాజీనామాలు చేస నాయకులు అంటే ఎలా ఉండాలో చెప్పిన ఘనత అప్పటి నాయకులది. కానీ ఇప్పటి రాజకీయ నాయకులను చూస్తే ప్రజలను పాలించే నాయకులు ఎలా ఉండకూడదో చాటి చెప్తున్నారు. దోషలుగా తేలాక మంత్రి పదవులను అట్టిపట్టుకొని కుర్చీలకు వేలాడాలనుకొనే అవినీతి మంత్రులు మనల్ని ఏలుతున్నందుకు మనమందరం సిగ్గుతో తలదించుకోవాలి. ఆరుగురు మంత్రులపై ఒకే రకమైన ఆరోపణలు వచ్చాయి. ఒకే రకమైన అవినీతి జీవోలపై సంతకాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తే కేవలం ఒక మంత్రిని మాత్రమే ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయడం కూడా భాదాకరమే. కేవలం ఆమంత్రి మాత్రమే సంతకాలు చేసి, మిగిలిన వారందరూ వేలిముద్రలు వేయలేదు కదా..నేటి రాజకీయ నాయకులు, మంత్రుల్లో నైతికత అనేది మచ్చుకైనా కానరావడం లేదు..అందినకాడికి దోచుకునేందుకు..మహా నేతలకు మేలు చేసేందుకు అడ్డగోలు జీవోలపై సంతకాలు  చేసి స్వలాభం..స్వామి లాభం చూసుకొన్న నేరగాళ్లయిన మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల దురదృష్టం..వీళ్లా మన పాలకులు.వీళ్లా మనకు నీతి వంతమైన మహా పాలనను అందించే నేతలు..కాదు వీరు నేరగాళ్లే కానీ నేతలు ఏమాత్రం కాదు..వీరేం ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందిస్తారు…ఏడుగురు మంత్రులకు ఆరుగురు మంత్రులు సుప్రీంకోర్టు నోటీసులు ఇస్తే నైతికంగా అయితే తప్పుకోవాలి..అయితే తప్పుకోవడం మాట దేవుడెరుగు..తప్పుఒప్పుకొని నిస్సిగ్గుగా బయట తిరుగుతున్న వీరిని చూసి ప్రజలే సిగ్గుతో తలదించుకొంటున్నారు. వీరు తప్పుకోకపోతే ప్రభత్వాధినేతగా సీఎం వీరిని తప్పించాల్సింది పోయి వీరికి న్యాయ సహాయం అందిస్తామని చెప్పుకోవడం..దానికి ప్రజల డబ్బులను ఉపయోగించడం అంటే ప్రజల డబ్బుతో అవినీతిని పరిరక్షించడమే. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ పరిస్థితి ఎంత హర్షనీయం కాదు. ఈ న్యాయసహాయం మంత్రుల వరకే ఆగలేదు…వారికి సహకరించిన అధికారులకు కూడా న్యాయసహాయం అందిస్తామని నిస్సిగ్గుగా చెప్పడం భాధాకరం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను తీసివేసి నీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసుకొంటే మంచిది. ప్రజల డబ్బును దోచుకొన్న అవినీతి అధికారులు, మంత్రులకు ప్రజల డబ్బుతో సహాయం చేయడం ఏ విధంగా సమర్థనీయం..? ప్రజలు జాగరూకులు కావాలి..ఓటు అనే తమ శక్తి వంతమైన ఆయధంతో వీరిని ఇంటికి పంపడం జరిగితేనే వీరు మారుతారేమో చూడాలి..