నాగార్జున అగ్రికెం ప్లాంట్‌ను మూసివేయాలని ధర్నా……

శ్రీకాకుళం, అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ఎచ్చర్లలోని నాగార్జున అగ్రాకెం ప్లాంట్‌ను మూసివేయాలని గ్రామస్థులు ఆందోళనలకు దిగారు. ఆదివారం ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు ప్లాంట్‌ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తూ ఉద్యోగులను అడ్డుకున్నారు. దీంతో జాతీయ దహదారిపై 8 కి.మీ మే ట్రాపిక్‌ నిపిచిపోయింది. పోలీసలు రంగప్రవేశం చేసి ఆందోళన కారులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో ప్లాంట్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.