నాయకులురాయికోటి నర్సిములు ను  సన్మానించిన యువ నాయకులు


జహీరాబాద్ మార్చి 21 (జనం సాక్షి) : ఇటీవల కాలంలో వివిధ కార్యక్రమాల్లో చురుకుగా  పాల్గొంటున్న రాయికోటి నర్సిములు  ను  ఝరాసంగం మండలం యువ నాయకులు  ఘనంగా సన్మానించారు. టివీవీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా  సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గా  అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న సందర్భంగా  అభినందిస్తు శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ఇంకా మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ పలువురి మన్నలు పొందాలన్నారు.ప్రతి రోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు చూస్తున్నాము అంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నియోజకవర్గ అధ్యక్షులు తెలుగు పాండు, దేవరం పల్లి ప్యాలవారం ఉప సర్పంచ్ లు శివ శంకర్ మాణిక్ యాదవ్, కొల్లూరు ఎంపీటీసీ రాజు కుమార్, బాబు జగ్గీవన్ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ నాయకులు రమేష్, శివరాజ్, డాక్టర్ జాన్ శ్రీకాంత్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.