నిబంధనల ప్రకారమే డెల్టాకు నీరు

హైదరాబాద్‌: నిబంధనల ప్రకారమే కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఈ విషయంలో రాజకీయం చేయొద్దని ఆయన నేతలను కోరారు. నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.