నిమ్స్ వద్ద భారీ గుంత.. రాకపోకలకు అంతరాయం
హైదరాబాద్: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతారాయం ఏర్పడింది. జీహెచ్‌ఎంసీ ఫైవ్‌లైన్ పనుల కోసం ఇక్కడ గత కొన్ని రోజులుగా గుంతలు తవ్వుతున్నారు. అయితే వర్షాల కారణంగా భూమి కుంగి ఒక్కసారిగా భారీ గుంత ఏర్పడింది. దీంతో పోలీసులు ఖైరతాబాద్ నుంచి వచ్చే వాహనాలను సోమాజీగూడ మీదుగా మళ్లిస్తున్నారు.