నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ది అగ్రస్థానం

హైదరాబాద్‌: నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ బి. వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో గృహ నిర్మాణ ప్రగతిని పవర్‌ పాయింట& ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రాష్ట్రంలో పేదల కోసం కోటి పక్కా ఇళ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. ఇందిరమ్మ పథకంలో అర్హులైన వారందరికీ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, లబ్థిదారులకు చెల్లింపుల్లో జాప్యం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని వివరించారు.