నిర్లక్ష్యం నీడన బయ్యన్న గుట్టలు

హుస్నాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : మండల కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో ఈశాన్య భాగానా ఉన్న బయన్న గుట్టలు ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిఉన్న పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురవుతుంది. బయన్నగా పిలువబడే కాలభైరవుని పది అడుగుల కూడ్య చిత్రం చెట్ల పొదల్లో  మగ్గిపోతుంది. శత్రు దుర్బేధ్యమైన సర్దార్‌ సర్వాయి పాపాన్న నిర్మించిన కోట ఆనవాలు లేకులండా అం తరించి పోతుంది. సైదాపూర్‌, హుస్నాబాద్‌, భీమదేవరపల్లి మండ లాలలోని సర్వాయిపేట, మహ్మాదాపూర్‌, ఉమ్మాపూర్‌, పోతారం (ఎస్‌), జిల్లెల్లగడ్డ, మంగళపల్లి, నర్సింగాపూర్‌, ముల్కనూర్‌ దాక దాదాపు 20 కిలో మీటర్ల మేర ఈ  గుట్టలు వ్యాపించి ఉన్నాయి. కొమ్ము గుట్ట గద్దరాళ్లు, కొత్తఖిలా, పాతఖిలా, చోడగుట్ట, దోణబండ, తైదలేనే, ఉరనే, నల్లేనే, వడ్లేనే బండల గుట్ట, బయ్యన్న లొద్ది, లింగాల బండ పాతర్ల గుట్ట, దేవుని గుట్ల ఇలాంటి పేర్లతో ఈ గుట్ట ల సంబోధిస్తుంటారు. 17వ శతాబ్దంలోనే బ్రాహ్మణ ఆధిక్యాన్ని, జమిందార్ల అరాచకత్వాన్ని మొగలాయి దుష్టపాలనను ఎదురించిన తెలంగాణ బహుజన పోరాట యోదుడు సర్వాయి పాపాన్న ఈ గుట్టల మీద కోటను నిర్మించారు. కాని అశ్వ, పదాతి దళాలను ఏర్పాటు చేసుకుని దండ యాత్రలు సాగించారు. కానీ పురాతత్వ శాఖ నిర్లక్ష్యం మూలంగా ఆ కోట, అక్కడి దేవాలయాలు, బుచ్చమ్మ అర్ర అనే ఆనాటి కిరాణ కొట్టు, రోలు, పచ్చీసు బండ, తహశీల్‌ గుండు, కోనేరు, శివలింగాలు లాంటివి నేడు శిథిలమై పోయాయి. బయన్న దేవుని ప్రాంగణం చెట్ల పొదలతో నిండిపోయి. భక్తుల దర్శ నానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో తండోపతండాలుగా బయన్న దర్శిం చుకుంటారు. పచ్చని చెట్లతో ఎతైన గుట్టల మధ్య ప్రకృతి రమణీ యతకు పరవశించి వనభోజనాలు, వనమహోత్స వాలు జరుపు కుంటారు. తరాలు మారినా బయన్న మీద భక్తి భావ నతో కొలు స్తూనే ఉన్నారు. సర్దార్‌ పాపారాయుని వీరోచిత గాథలను నెమరు వేసుకుంటూనే ఉన్నారు. ఈ ప్రాంతంలో పశువులు మేక లకు పుష్టినిచ్చే పశుగ్రాసం విరివిగా లభిస్తుంది. కోతులు, ఎలుగు బం ట్లు, నెమళ్లు వంటి వన్య ప్రాణులు ఇక్కడ జీవిస్తున్నాయి. శివు డు, బయన్న తదితరులు దేవాలయాల ఆనవాళ్లు ఉన్నాయి. అనేక రకా ల ఔషధమూలికలు సహజసిద్ధంగా పెరుగుతున్నాయి. కాగా కొం దరు అజ్ఞాతవ్యక్తులు ఇక్కడ గుప్తనిధుల కోసం తరుచూ తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్‌ మాఫియా కన్ను కూడా ఈ గుట్టల మీద పడింది. కావున పాలకులు, పురావస్తుశాఖ, పర్యాటకశాఖ, ధార్మిక సంస్థలు స్పందించి బయన్న గుట్టలను సందర్శనీయ స్థలంగా పునరుద్ధ రించాలని పలువురు కోరుతున్నారు.