నిలకడగా పారికర్‌ ఆరోగ్యం

పనాజీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గోవా మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారు. పారికర్‌ కు అప్పర్‌ జీఐ ఎండోస్కోపీ  చేస్తున్న వైద్యులు.. ఐసోలేటెడ్‌ రూములో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ..భయపడాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. ఇక పారికర్‌ ఓ ్గ/టైర్‌ అంటున్న గోవా ఆరోగ్యశాఖా మంత్రి విశ్వజీత్‌ రాణె .. ఒక్క రోజులోనే ఆయన తిరిగి ఇంటికి వెళ్తారని చెబుతున్నారు.