నెల రోజుల ప్రకటన కొత్త నాటకం : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయమని కేంద్ర హోంమంత్రి షిండే చేసిన ప్రకటన కొత్త నాటకమని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అఖిలపక్ష భేటీలో అభిప్రాయం చెప్పకుండా కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి పరంపరను కొనసాగించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేకమో కాంగ్రెస్‌ స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కేంద్రం వైఖరిని ఎండగడుతూ రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.