నేటితో ముగియనున్న పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి, సమావేశాల ప్రారంభం నుంచి బొగ్గు కుంభకోణం వ్యవహారంపై పార్లమెంట ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని నైతిక భాద్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశాయి. అయితే సమావేశాల చివరిరోజైన శుక్రవారం ఎన్టీఏ పక్షాలు పార్లమెంట్‌ అవరణలో ధర్నా చేపట్టాలని నిర్ణయించాయి.