నేటి నుంచి గ్రూప్‌ -4 పరీక్షలు

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-4 పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం శని, ఆదివారాల్లో ఏపీపీఎస్సీ నిర్వహించనున్న ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీపీఎస్సీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓఎంఆర్‌ షీట్‌లో తప్పులు రాసి, వైట్‌నర్‌ ఉపయోగిస్తే వారిని ఆనర్హులుగా ప్రకటిస్తామని అధికారులు స్పష్టం చేశారు.