నేడు ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌:ఈనెల 8వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించనున్న వ్యూహంపై చర్చించేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు సోమవారం ఢిల్లీలో భేటీ అవుతున్నారు. ఎంపీ గుత్తసుఖేందర్‌రెడ్డి నివాసంలో ఈ సమావేశం అనంతం వారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ను కలుసుకుంటారు. ఆ తరువాత కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సభ్యులను కూడా కలిసే అవకాశంముంది.