నేడు హైదరాబాద్‌కు ప్రణబ్‌

హైదరాబాద్‌:  రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ తరపున పోటీ చేస్తున్న ప్రణబ్‌ముఖర్జీ ఆదివారం హైదరాబాద్‌ వస్తున్నారు. జూబ్లీహాల్‌లో ఏర్పాటుచేసే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు చైన్నై నుంచి పన్నెండున్నర గంటల వరకు జరిగే సీఎల్‌పీ సమావేశంలో  పాల్గొంటారు. మధ్యాహ్న  భోజన అనంతరం బెంగళూరుకు బయల్దేరి వెళతారు. ప్రణబ్‌ వెంట ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్‌ కూడా వస్తున్నారు. ప్రణబ్‌ను సమావేశానికి ఆహ్వానించేందుకు సీఎల్‌పీ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.  ఇప్పటివరకు ఆరెండు పార్టీల నేతలతో భేటీ ఖరారు కాలేదు. కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిసున్న ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రణబ్‌ను జూబ్లీహాల్‌లోగాని, ఆయన బస చేసే హోటల్‌లోగాని కలవనున్నారు.