నేతలకు సీఎం అభినందనలు

హైదరాబాద్‌: కేంద్రంలో కొత్తగా మంత్రి పదవులు చేపట్టనున్న రాష్ట్ర నేతలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. మంత్రి వర్గపునర్‌వ్యవస్థీకరణలో రాష్ట్రానికి పెద్దపీట వేసినందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు.