నేనేలాంటి అక్రమాలకు పాల్పడలేదు: స్వామిగౌడ్‌

హదరాబాద్‌: నేనేలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్వామిగౌడ్‌ స్పష్టం చేశారు. సొసైటీలో అక్రమాలు జరియంటూ సహకార సంఘం కో-ఆపరేటీవ్‌ రిజిస్ట్రార్‌ కిరణ్మయి ఇచ్చిన నివేధిక తప్పంటూ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబందనలు తాము ఎక్కడా ఉల్లంఘించలేదని, ఇంజనీరింగ్‌ సూచనల మేరకే ధరలు పెంచామని ఆయన తెలిపారు. గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన హౌసింగ్‌ సొసైటీ సర్వసభ్య సమావేశౄనికి పెద్ద సంఖ్యలో సొసైటీ సభ్యులంతా హజరయ్యారు. కిరణ్మయి నివేదికను వ్యతిరేకిస్తూ పలు తీర్మానాలు చేశారు. మరో వైపు ఈ సొసైటీ అక్రమాలపై హైకోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సమావేశాలు నిర్వహించడం సరికాదని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.