నేలచూపులు చూస్తున్న పసిడి
ముంబయి, జనంసాక్షి: బంగారం ధరలు వరుసగా నష్టాల్లో ఉన్నాయి. డాలర్ బలపడటం వల్ల ఔన్స్ గొల్డ్ ధర 3 డాలర్లు నష్టపోతూ 1382 డాలర్లకు సమీపంలో ట్రేడవుతుంది. గత 10 రోజుల్లో ఔన్స్ ధర దాదాపు 100 డాలర్లు కోల్పోయింది. పర్సెంటేజీ వైజ్ చూస్తే ఈ మొత్తం దాదాపు 14 శాతానికి సమానం.
అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్…. బాండ్ల కొనుగోలును నిలిపివేయొచ్చరే అంచనాలతో డాలర్‌కు బలమొస్తుంది. ఏప్రిల్ నెలలో ధర భారీగా పడినప్పుడు ఇండియా, చైనా, అమెరికాల నుంచి పెద్దయెత్తున ఫజికల్ డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఈ డిమాండ్ కాస్త సద్దుమణుగడం కూడా ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమవుతుంది.
ఎంసీక్స్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 100 రూపాయలకు పైగా నష్టపోతూ 26 వేల రూపాయలకు సమీపంలో ట్రేడవుతుంది. గత 2 వారాల్లో ఎంసీక్స్ ధర 1000 రూపాయలు పైగా కోల్పోయింది. వారం రోజుల్లో రూపాయి బలహీనపడటం వల్ల మన దేశంలో బంగారం ధర కొంత తక్కువగా నష్టపోయింది. ఇవాళ డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైనలు నష్టపోతూ 54.88 సమీపంలో ట్రేడ్‌వుతుంది.



