న్యాయస్థానం ముందుకు ఢీల్లీ అత్యాచార ఘటన నిందితులు
న్యూఢీల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థిని పై సాముహిక అత్యాచారం ఘటనలో ఐదుగురు నిందితులను ఢీల్లీలోని సాకేత్ న్యాయాస్థానం ముంందు పోలిసులు హాజరు పరిచారు. ఈ కేసులో నిందితులు రామ్‌సింగ్, ముఖేశ్. పవస్‌గుప్థా వినయ్ శర్మ అక్షయ్‌ఠాకూర్‌లను న్యాయముర్తి ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువచ్చరు. పాఠశాల పత్రాల ఆధారంగా ఆరో నిందితున్ని మైనర్‌గా గుర్తించి జువైనల్ హోమ్‌లో ఉంచారు. ఇతన్ని బాల నేరస్తుల న్యాయస్థానం ముందు విచారణకు హాజరుపరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన వెయ్యి పేజీల ఛార్జిషీట్‌ను కోర్టు స్వీకరించింది. నిందితులుపై అత్యాచారం, హత్యలతోపాటు సాక్షాల విధ్వంసం,కుట్ర తదితర అభియోగాలను పోలీసులు నమోదు చేశారు.