న్యాయ సహాయం ఎందుకో చెప్పాలి : ఎర్రంనాయుడు

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : తప్పు చేసిన మంత్రులకు న్యాయ సహాయం ఎందుకు అందిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉందని టీడీపీ సీనియర్‌ నేత ఎర్రంన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆదివారంనాడు విలేకరులతో మాట్లాడారు. తప్పు చేసిన మంత్రులకు న్యాయ సహాయం అందించడమంటే జగన్‌కు మేలు చేసినట్టేనని అన్నారు. మంత్రుల తప్పిదాల వల్లే జగన్‌ లాభపడ్డాడని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జగన్‌తో కుమ్మక్కై దొంగాటకం ఆడుతున్నా యన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీతో జత కడతానని జగన్‌ గతంలోనే చెప్పిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. విజయమ్మ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటి నుంచి జగన్‌ను రక్షించే ప్రక్రియ ప్రారంభమైందని ఆరోపించారు.