న్యాలకల్ లో ఘనంగా పోషణ పక్షం వారోత్సవాలు,

న్యాలకల్ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం వారోత్సవాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా బాలింతలు, గర్భిణి మహిళలచే అంగన్వాడీ టీచర్ ప్రతిజ్ఞ చేయించారు. ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ సునితబాయి హాజరై మాట్లాడుతూ చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు. చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవడం వలన నూట్రీ యన్స్ పెరుగుతాయన్నారు. బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారని ఆమే చెప్పారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ అనిత కుమారి మాట్లాడుతూ తప్పకుండా తల్లులు ప్రతి భోజనంలో చిరు ధాన్యాలు ఉండే విదంగా చూసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఐకెపి ఏపీఎం, అంగన్వాడి ఆయా గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.