న్యూ హరిజన్స్ స్కూల్ నందు ఘనంగా స్పోర్ట్స్ అండ్ సైన్స్ ఫెయిర్
ముప్కాల్ (జనం సాక్షి ) మార్చ్ 11 మండల పరిధిలోని న్యూహరిజన్స్ స్కూల్ నందు శుక్రవారం జరిగిన స్పోర్ట్స్ అండ్ సైన్స్ ఫెయిర్ ని ఇంచార్జ్ ఎస్సై తొగర్ల సురేష్ మరియు మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలను తిలకించి బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఇంచార్జ్ ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెట్టి తయారు చేసినటువంటి ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు రాజేశ్వర్ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి ప్రదర్శనలు చాలా అవసరమని పేర్కొన్నారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసి విద్యార్థుల నృత్యాలను తిలకించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రత్నాకర్ మరియు ప్రిన్సిపాల్ చంద్ర విలాస్ ఉపాధ్యాయ బృందము విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు