పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తాం: బొత్స

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. బీసీలకు జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు ఉండాలనేది తమ అభిప్రాయమన్నారు. కానీ, రాజ్యాంగం, న్యాస్థానం తీర్పులను గౌరవించాల్సి ఉందని తెలిపారు.