జూలూరుపాడు, డిసెంబర్13, జనంసాక్షి: మండల పరిధిలోని పడమట నరసాపురంలో ఉన్న గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు 35 మంది విద్యార్థినిలు అనారోగ్యం పాలయ్యారు. సోమవారం రాత్రి 25 మంది విద్యార్థులకు జూలూరుపాడులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యం అందించారు. వీరిలో ఎక్కువమంది కడుపునొప్పి వాంతులు విరోచనాలు వంటి లక్షణాలతో బాధపడటంతో వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య సేవలు నిర్వహించారు. అనంతరం రాత్రి విద్యార్థినులను పాఠశాలకు పంపించారు. మంగళవారం ఉదయం మరో 10 మంది విద్యార్థులు కూడా ఇవే లక్షణాలతో బాధపడుతూ ఉండటంతో ఆసుపత్రికి తరలించి పాఠశాల యాజమాన్యం వైద్యం అందించింది. విషయం తెలుసుకున్న తాసిల్దార్ లూధర్ విల్సన్ ఉదయాన్నే ఆశ్రమ పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. పడమటి నర్సాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ కట్రం మోహన్ రావు, టిఆర్ఎస్ నేత ఖాజా రమేష్ పాఠశాలకు వెళ్లి విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం పట్ల వివరాలను తెలుసుకున్నారు. ఎంపీపీ లావిడియా సోనీ, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, మోదుగు రామకృష్ణ పలువురు నాయకులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు.
పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్* 35 మంది విద్యార్థినులకు అనారోగ్యం* వైద్యం అందించిన యంత్రాంగం
Other News
- బీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..