పత్తి పంటలపై రైతులకు అవగాహన అవసరం
ఖమ్మం, జూలై 31 : పత్తి పంటలపై రైతులు అవగాహన కలిగివుండాలని ఖమ్మం వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు రైతులకు సూచించారు. ఖమ్మంలో వేలాది ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేసినట్లు వివరించారు. పత్తి పంటలో 40 రోజుల లోపు ఎక్కువగా ఎరుపు రోగం ఆశించే ప్రమాదం ఉందని రైతులు ఆదర్శ రైతుల సహకారంతో పలు సూచనల సలహాల మేరకే పత్తి పంటపై మందులు పిచుకారి చేసి తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించేలా వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలని ఆయన సూచించారు. ప్రతి నెల ఆదర్శ రైతులు కిసాన్ శాఖ ఆధ్వర్యంలో విత్తన శిక్షణకు హాజరు కావాలని, హాజరు కాని ఆదర్శ రైతులపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ వాతావరణ ఆధారిత బీమా, క్రిమి సంహారక మందుల వాడకం, కంపొస్ట్ ఎరువుల కలిగే లాభనష్టల గురించి రైతులకు తెలియజేస్తూ ఈ ఏడాది అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు.