పరకాల కాంగ్రెస్‌ సమావేశం రసాభాస

పరకాల : వరంగల్‌ జిల్లా పరకాల కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తల వాగ్వాదాలు, విమర్శల మధ్య ముగిసింది. కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రభుత్వ ఛీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఫొటో చిన్నదిగా ఉందంటూ ఆయన వర్గీయులు గొడవకు దిగారు. కొంతమంది నాయకులు వైకాపాకు అమ్ముడు పోయారని కూర్చిలను విసిరారు.