పర్యటనలో హిల్లరీ క్లింటన్‌ రికార్డు

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ పర్యటనలో రికార్డు సృష్టించారు. ఇజ్రాయెల్‌లో ఆమె సోమవారం మాట్లాడుతూ. నాకు ఇక్కడ ఉండటం చాలా ఇష్టం. అయితే నేను వెళ్లాల్సి ఉంది. అని పేర్కొన్నారు. పర్యటన బృందం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉందని తెలిపారు. 2009లో అమెరికా విదేశాంగ మంత్రి అయినప్పటి నుంచి ఆమె 351 రోజుల పాటు 102 దేశాలు సందర్శించారు. 13,58,027 కలోమీటర్లు 8,43,839 మైళ్లు ప్రయాణించారు. ఇంత దూరం గతంలో కొందరు ప్రయాణించినా ఇన్ని దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఏ అమెరికా మంత్రీ తిరగలేదు.