*పర్యావరణానికి హాని చేయని మట్టి గణపతిని మాత్రమే వినియోగిద్దాం*
నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హానికరమైన రసాయనాల రంగులు ఉపయోగించి తయారు చేసిన గణపతి విగ్రహాలు పూజలకు వినియోగిస్తూ,పిమ్మట చెరువుల్లో కాలువల్లో నిమజ్జనాలు చేస్తున్నారు,తద్వారా నీటి కాలుష్యం, నీటిలోని జీవరాసులకు ప్రాణనష్టం జరుగుతుందని ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా గణపతి పూజలో పర్యావరణానికి హాని చేకూర్చని మట్టి విగ్రహాలు మాత్రమే వినియోగించాలని కోరుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దిర్షించర్ల విద్యార్థిని విద్యార్థులు మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసి తాము మట్టి గణపతి ప్రతిమలనే పూజలో వినియోగిస్తామని అందరూ ఇలానే చేస్తే పర్యావరణానికి మేలు చేసిన వారవుతారని అన్నారు. ప్రధానోాధ్యాయులు బట్టు మధు విద్యార్థులను మరియు ప్రోత్సహించిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులనుఅభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జి శ్రీదేవి వి శ్రీనివాసరావు, జె శ్రీనివాస్,ఎన్ విజయకుమార్, ఎ అశోక్ కుమార్,ఎం యాదగిరి,ఎన్ కోటిరెడ్డి, బి. కృష్ణయ్య, పాల్గొన్నారు.