పాకిస్థాన్‌ మాజీ ప్రధాని గిలానీ తనయుడు అరెస్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని యూసుఫ్‌ రజా గిలానీ తనయుడు అలీ మూసాను శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక దళం (ఏఎన్‌ఎఫ్‌) అరెస్టు చేసింది. ముందస్తు బెయిలు కోసం దరశాస్తు చేసుకునేందుకు సుప్రీంకోర్టుకు వచ్చిన అలీని కోర్టు ద్వారం వద్దే ఏఎన్‌ఎఫ్‌ అదుపులోకి తీసుకుంది. అరగంటలో అలీని తమ ముందు హాజరుపరచాలన్న త్రిసభ్య ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టులో హాజరు పరిచింది. అనంతరం రూ.5 లక్షల పూచీకత్తుపై అలీకి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.