పాక్‌లో ఎయిర్‌ఇండియా విమానం….

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఎయిర్‌ఇండియాకు చేందిన ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సాంకేతిక లోపం వల్ల ఈ విమానంలోని హైడ్రాలిక్‌ సిస్టమ్స్‌ ఫెయిల్‌ అవడంతో అత్యవసరంగా దించేందుకు పైలట్‌ సిందూ ప్రాంతంలోని నవాబ్‌ షా ఎయిర్‌పోర్టు కోరారు. ఎయిర్‌పోర్టు అధికారుల అనుమతితో విమానాన్ని సురక్షితంగా దించారు. అబుదాబి నుండి ఢిల్లీ వస్తున్న ఈ విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నారు.